కర్ణాటక బిజెపి ఉపాధ్యక్షుడిగా యడ్యూరప్ప కుమారుడు

Yediyurappa son made Karnataka BJP vice-president

బెంగళూరు: కర్ణాటక సిఎం యోడియూర‌ప్ప కుమారుడు బీవై విజ‌యేంద్ర ఆ రాష్ట్ర బిజెపి ఉపాధ్య‌క్షుడిగా నియామ‌కం అయ్యారు. బిజెపి అధ్య‌క్షుడు న‌లిన్ కుమార్ క‌తీల్ విజ‌యేంద్ర‌తో పాటు మ‌రో 9 మంది ఉపాధ్య‌క్షుల‌ను నియ‌మిస్తూ శుక్ర‌వారం ప్ర‌క‌ట‌న చేశారు. ఉపాధ్య‌క్షులతో పాటు న‌లుగురు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీలు, 10 సెక్ర‌ట‌రీలు, ఇద్ద‌రు కోశాధికారులను న‌లిన్ కుమార్ నియ‌మించారు. ఈ సంద‌ర్భంగా విజ‌యేంద్ర త‌న తండ్రి పాదాల‌కు న‌మ‌స్క‌రం చేశారు. ఈ ఫోటోను ట్వీట్ చేస్తూ.. క‌ర్ణాట‌క బిజెపి ఉపాధ్య‌క్షుడిగా త‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించినందుకు అమిత్ షా, జేపీ న‌డ్డా, న‌లిన్ కుమార్, యోడియూర‌ప్ప‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌ర్ణాట‌క‌లో పార్టీని మ‌రింత బలోపేతం చేయ‌డానికి కృషి చేస్తాను అని విజ‌యేంద్ర స్ప‌ష్టం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/