ఈనెల 12న కేబినెట్‌ విస్తరణ

Kumaraswamy
Kumaraswamy

బెంగళూరు: కర్ణాటక సిఎం హెచ్‌డీ కుమారస్వామి ఈనెల 12న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఈరోజు మధ్యాహ్నం గవర్నర్‌ వాజూభాయ్ వాలాను కలుసుకుని మంత్రివర్గ విస్తరణకు సమయం కేటాయించాల్సిందిగా ఆయనను కోరారు. అయితే అధికార వర్గాల సమాచారం ప్రకారం, కుమారస్వామి తన కేబినెట్‌లో ముగ్గురికి చోటు కల్పించనున్నారు. వీరిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటారు. రనెబెన్నూరు స్వతంత్ర అభ్యర్థి ఆర్.శంకర్, ములబగిలు ఎమ్మెల్యే నగేష్‌కు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలున్నాయి.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/