సిఎల్‌పి పదవికి సిద్ధరామయ్య రాజీనామా

Siddaramaiah
Siddaramaiah

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన సిఎల్‌పి పదవికి రాజీనామా చేశారు. కాగా ఈ ఎన్నికల్లో బిజెపి తన సత్తాను చాటుకుంది. 15 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగగా 12 స్థానాల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. కాంగ్రెస్‌ పార్టీ కేవలం రెండు స్థానాల్లోనే గెలుపొందింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా తీర్పును కాంగ్రెస్ పక్ష నేతగా తాను గౌరవించాలని ఆయన చెప్పారు. సీఎల్పీ పదవికి రాజీనామా చేశానని… రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించానని సిద్ధరామయ్య తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/