గవర్నర్ డెడ్ లైన్ ను పట్టించుకోని స్పీకర్, సీఎం

Karnataka Assembly Speaker
Karnataka Assembly Speaker

Bangalore: కర్నాటక గవర్నర్ వజుభాయ్ వాలా డెడ్ లైన్ ముగిసింది. ఆయన విధించిన డెడ్ లైన్ ను స్పీకర్ రమేష్ కుమార్ కానీ, ముఖ్యమంత్రి కుమార స్వామి కానీ పట్టించుకోలేదు. ఈ రోజు1.30 లోగా కుమారస్వామి విశ్వాస తీర్మానంపై చర్చ ముగించి ఓటింగ్ నిర్వహించాలని గవర్నర్ వజుభాయ్ వాలా స్పీకర్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే మీరు సభా విశ్వాసం కోల్పోయారు, విశ్వాస పరీక్ష కు అడ్డంకులు కల్పించడం భావ్యం కాదంటూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన సంగతీ విదితమే. అయితే గవర్నర్ ఆదేశాలను స్పీకర్ కానీ, ముఖ్యమంత్రి కానీ ఇసుమంతైనా పట్టించుకోలేదు. పభలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ వ్యతిరేక నినాదాలతో గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో  స్పీకర్ సభను మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేశారు. 

Visit our Twitter Page & Facebook Page