హిందీ పేర్లున్న కేంద్ర పథకాలపై కనిమొళి ఆగ్రహం

Kanimozhi
Kanimozhi , DMK MP

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలపై తూత్తుకుడి ఎంపి, డిఎంకే నేత కనిమొళి కరుణానిధి మండిపడ్డారు. లోక్‌సభలో గురువారం మాట్లాడిన ఆమె ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నీ హిందీలో మాత్రమే ఉంటున్నాయని, ఆ భాషను తన నియోజకవర్గంలో ఉన్న ఓ గ్రామీణురాలు ఎలా అర్ధం చేసుకోగలదని ఘాటుగా ప్రశ్నించారు. కనీస అనువాదం లేకుండా ఎలా ఏర్పాటు చేస్తారన్నారు. స్థానిక భాషలకు ప్రాధాన్యం లేకుండా చేయడాన్ని సహించేది లేదన్నారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/