బెగుసరాయ్ నుంచి సిపిఐ అభ్యర్థి కన్హయ్య నామినేషన్‌

kanhaiya kumar
kanhaiya kumar


బీహార్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్ధి సంఘం మాజీ నేత కన్హయ్య కుమార్‌ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని బెగుసరాయ్ పార్లమెంటు స్థానం నుంచి సిపిఐ తరఫున కన్హయ్య కుమార్‌ పోటీ చేస్తున్నారు. అక్కడ ఏప్రిల్‌ 29న ఎన్నికలు జరగనున్నాయి.
జేఎన్‌యూలో 2016లో జరిగిన కార్యక్రమంలో భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, పార్లమెంటుపై జరిగిన దాడిలో కీలక వ్యక్తిఐన అఫ్జల్‌గురును పొగిడాడన్న ఆరోపణల నేపథ్యంలో కన్హయ్య కుమార్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపిన జేఎన్‌యూ కమిటీ కన్హయ్యకుమార్‌కు జరిమానా విధించింది. ఐతే జేఎన్‌యూ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు వ్యతిరేకించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/