రాష్ట్ర మంత్రులకు సిఎం కమల్‌నాథ్‌ ఆదేశాలు

Kamal Nath
Kamal Nath

భోపాల్‌: అసెంబ్లీలో సిఎం కమల్‌నాథ్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుక్కొవాలని ఎగ్జిట పోల్‌ ఫలితాలు వెలువడిన వెంటనే బిజెపి నాయకులు సవాల్‌ విసిరిన సందర్భంగా ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందోనన్న అభద్రతా భావంతో కాంగ్రెస్‌ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సిఎం కమల్‌నాథ్‌ ఎమ్యెల్యెలెవరూ బిజెపి వలలో పడకుండా జాగ్రత్తపడాలని తాజాగా రాష్ట్ర మంత్రులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఐదుగురు ఎమ్మెల్యెలపై దృష్టి సారించాలని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమావేశం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/