దర్శకుడు బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్‌, రజనీ

ప్రొడక్షన్ సంస్థ కోసం కొత్త ఆఫీసు నిర్మించుకున్న కమల్

Kamal Haasan and Rajinikanth - K Balachander's statue
Kamal Haasan and Rajinikanth – K Balachander’s statue

చెన్నై: కమల్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సంస్థ కోసం చెన్నైలో కొత్త కార్యాలయం నిర్మించుకున్నారు. ఆ కార్యాలయ ప్రారంభోత్సవానికి రజనీకాంత్ సహా అనేకమంది చిత్రప్రముఖులను ఆహ్వానించారు. ఆ కార్యాలయంలోనే బాలచందర్ విగ్రహం ఏర్పాటు చేయించిన కమల్, ఆ విగ్రహాన్ని రజనీకాంత్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజనీకాంత్, కమల్ హాసన్ ఒకరిపై ఒకరు అభినందనల జల్లు కురిపించుకున్నారు. కమల్ రాజకీయాల్లో ప్రవేశించినా సినిమా రంగాన్ని మాత్రం మర్చిపోలేదని, కళను ఎల్లప్పుడూ అనుసరిస్తూనే ఉన్నారని రజనీ కొనియాడారు. కమల్ మాట్లాడుతూ, రజనీ, తాను ఒకరినొకరు గౌరవించుకుంటామని, విమర్శించుకుంటామని, ఒకరి పనిని మరొకరం ఇష్టపడుతూనే ఉంటామని వివరించారు. ఇరువురి భవిష్యత్ శుభప్రదంగానే ఉంటుందని తమకు గట్టి నమ్మకం అని తెలిపారు.
కాగా జాతీయ స్థాయిలో తమదైన ముద్రవేసిన రజనీకాంత్, కమల్ హాసన్ కూడా బాలచందర్ శిష్యులే. ఇప్పుడు వారిద్దరూ తమ గురువైన బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ధన్యులయ్యారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/