ఈవిఎంల పనితీరుపై, ఎన్నికల నిర్వహణపై సుప్రీంకు పాల్‌!

ka paul
ka paul


న్యూఢిల్లీ: ఎన్నికల్లో అవతవకలపై, ఈవిఎంల పనితీరులపై సుప్రీంను ఆశ్రయిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. ఈ అవకతవకలపై సమాధానం చెప్పేందుకు ఈసి నిరాకరిస్తుందని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈవిఎంల పనితీరుపై సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. నర్సాపురంలో మధ్యాహ్నం వరకు ఈవిఎంలు పనిచేయలేదని, మూడో విడత ఎన్నికల బహిష్కరణకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సహా చాలా మంది నేతలు అంగీకరించారని చెప్పారు. ప్రధాని మోది విధానాలను రాజ్‌నాథ్‌ , గడ్కరీ వంటి నేతలే విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం కాపాడేందుకే తాను పోరాటం చేస్తున్నట్లు పాల్‌ చెప్పారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/