న్యాయం ఎప్పుడూ ప్రతీకార రూపంలో ఉండకూడదు: ‘సుప్రీం’ చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే

CJI Justice Babde

Jayapura: న్యాయం ఎప్పుడూ ప్రతీకార రూపంలో ఉండకూడదని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే అన్నారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని జయపురలో హైకోర్టు కొత్త భవనాన్ని సీజేఐ జస్టిస్‌ బాబ్డే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణ న్యాయం సాధ్యపడదని తాను భావిస్తున్నానన్నారు. న్యాయం అనేది ప్రతీకార రూపంలో ఉంటే దాని లక్షణం కోల్పోతుందన్నారు. న్యాయ వ్యవస్థలో తప్పులు సరిదిద్దుకునే వ్యవస్థ తేవాల్సి ఉందన్నారు. కేసుల పరిష్కారానికి తప్పనిసరిగా మధ్యవర్తిత్వ వ్యవస్థ ఉండాలన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/