జర్నలిస్టుపై దాడి, ఆ పై నోట్లో మూత్రం

attack on journlist
attack on journlist

లక్నో: యూపిలో జీఆర్పీ పోలీసుల దాష్టీకం రోజురోజుకు పెరిగిపోతుంది. అక్కడ జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయి. ఓ జర్నలిస్టుపై అకారణంగా దాడి చేసి బలవంతంగా మూత్రం తాగించారు. యూపిలోని దిమన్‌పురా వద్ద మంగళవారం రాత్రి ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో న్యూస్‌ 24కు చెందిన అమిత్‌శర్మ అనే జర్నలిస్టు ఆ ఘటన కవరేజి కోసం వెళ్లాడు. అక్కడున్న జీఆర్పీ పోలీసులు శర్మ వద్ద ఉన్న కెమెరాను లాక్కొని అతన్ని తీవ్రంగా చితకబాదారు. అంతటితో ఆగకుండా స్థానికంగా ఉన్న జీఆర్పీ స్టేషన్‌ లాకప్‌లో వేశారు.
అతన్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ, బట్టలూడదీశారు. ఆ తర్వాత జర్నలిస్టు నోట్లో మూత్రం పోశారు. ఈ విషయం తెలుసుకుని జర్నలిస్టులు నిరసన తెలపడంతో బుధవారం ఉదయం శర్మను పోలీసులు విడుదల చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన జీఆర్పీ పోలీసులను పోలీసు ఉన్నతాధికారులు సస్సెండ్‌ చేశారు.

తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/tours/