కేరళ వరుస హత్యల నిందితురాలి జాబితాలో మరిన్ని…

Jolly
Jolly

తిరువనంతపురం: కేరళ కోజికోడ్‌లో వరుస హత్యలు చేసిన నిందితురాలు జాలీ చేసిన మారణకాండకు మరింతమంది బలైనట్లు వెల్లడయింది. ఆమె ఆరుగురిని మాత్రమే హత్య చేయలేదని, ఇంకా చాలా మంది ఉన్నారని తెలుస్తున్నది. 2002లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆ ప్రమాదాన్ని చేయించిందని జాలీయేనని వెల్లడయింది. ఆస్తి కోసం అత్తమామలు సహా మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యుల హత్యకు పాల్పడిన జాలీ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. ఆమె మొదటి భర్త రా§్‌ుథామస్‌ సమీప బంధువు ఎల్సమ్మ అనే మహిళ జాలి మరిన్ని హత్యలకు పాల్పడినట్లు వెల్లడించారు. 2002లో తన కుమారుడు సునీష్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని, ఆ ప్రమాదం చేయించింది జాలీయేనని ఎల్సమ్మ చెపుతున్నది. అలాగే విన్సెంట్‌ అనే వ్యక్తి ఆత్మహత్యకు, స్థానిక కాంగ్రెస్‌ నేత రామకృష్ణ మృతికి కూడా కారణం జాలీయేనని ఆరోపించింది. ఎల్సమ్మ తెలిపిన వివరాల మేరకు కేసు పునర్విచారణ చేస్తామని ఎస్సీ కె.జి.సమోన్‌ తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/