కేరళలో బిజెపి ఓటమిపై బాలీవుడ్‌ స్టార్‌ కామెంట్‌

John abraham
John abraham


ముంబయి : రాజకీయాలకు దూరంగా ఉండే నటుడిగా బాలీవుడ్‌లో పేరున్న జాన్‌ అబ్రహాం ప్రత్యేకించి కేంద్రం అధికారంలో ఉన్న బిజెపి, ఎన్డీఎ కూటమిని దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేశారు. ఆయన సినిమాల్లో ఎక్కువగా దేశభక్తి కనిపిస్తుంటుంది. సత్యమేవజయతే, పరమాణు, మద్రాస్‌ కెఫె వంటి సినిమాలు ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన బాట్లా హౌస్‌ సినిమాలో నటించారు. జాన్‌ అబ్రహాం సొంత రాష్ట్రం కేరళ. తండ్రి మలయాళీ క్రిస్టియన్‌.తల్లి జొరాస్ట్రియన్‌. గాడ్‌ హు లవ్డ్‌ మోటార్‌ బైక్స్‌ ఇన్‌ ముంబయి అనే పుస్తకావిష్కరణకు విచ్చేసిన అబ్రహాం ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో ఒకట్రెండు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ఎన్డీఎ హవా, నరేంద్ర మోఈ ప్రభంజనం వెల్లువెత్తింది. దక్షిణాదిన ఎపి, తమిళనాడు, కేరళలో ఒక్కో స్థానం కూడా గెలవలేకపోయింది. ఇదే విషయాన్ని ఆయనను ప్రశ్నించగా సొంత రాష్ట్రం కేరళలో బిజెపి ఒక్క సీటును కూడా ఎందుకు గెలుచుకోలేకపోయింది, కేరళ మోడీఫైడ్‌ ఇంకా ఎందుకు కాలేదని ప్రశ్నించగా జాన్‌ అబ్రహాం అందుకు సమాధానంగా దటీజ్‌ ద బ్యూటీ ఆఫ్‌ కేరళ అంటూ బదులు ఇచ్చారు. కేరళలో అన్ని చోట్ల సర్వమత సమానత్వం కనిపిస్తుంది. ఆ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఉంటాయని ఏ ఒక్క మతాన్ని గానీ, కులాన్ని గానీ, మలయాళీలు ఆదరించరని చెప్పారు. అన్ని మతాలను వారు గౌరవిస్తారన్నారు. మలయాళీలకు మతం గొడవలు, కులం విద్వేషాలు అంటించడం అంత సులభం కాదని చెప్పారు. చాలా చోట్ల ఆలయాలు, మసీదులు, చర్చిలు పక్కపక్కనే ఉంటాయని, అయినప్పటికీ ఎలాంటి గొడవల జోలికి వెళ్లకుండా పరసం గౌరవించుకుంటారన్నారు. క్యూబా విప్లవీరుడు ఫిడెల్‌ క్యాస్ట్రో దివంగతుడైన తరువాత తాను కేరళకు వెళ్లానని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా క్యాస్ట్రోకు నివాళులు అర్పిస్తూ వాల్‌ పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్లు కట్టారని అన్నారు. ఇలాంటివి మనదేశంలోని ఏ రాష్ట్రంలోనూ చూడలేదన్నారు. మలయాళీల్లో వామపక్ష భావజాలం నరనరాన జీర్ణించుకుపోయిందనిడానికి ఈ ఉదాహరణ చలన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/