రాహుల్‌ మీద ఆంక్షలు విధించడం సరికాదు

Chidambaram
Chidambaram

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌పై మండిపడ్డారు. రాహుల్‌ గాంధీకి జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ ఇచ్చిన ఆహ్వానంలో నిజాయతీ లేదు. ఇది ప్రచారం కోసం మాత్రమే. రాహుల్‌ గాంధీ మీద ఆంక్షలు విధించడం సరికాదు. ఆయనకు సైనికులతో సహా అందరినీ కలిసే స్వేచ్ఛ ఇవ్వాలి. అలా ఎలా ఆంక్షలు పెడతారు. ఒక పర్యాటకుడు వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడటం, సైనికుల సంక్షేమం గురించి అడగడం వంటికి చేయకూడదా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా చిదంబరం ట్వీట్లు చేశారు.
కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ సోమవారం మండిపడ్డారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/