తండ్రి, కూతురుపై నక్సల్స్‌ కాల్పులు

raju shah
raju shah

పాట్నా: నక్సల్స్‌ల ఘతాకం బీహార్‌లోని మలయ్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో బంగారం వ్యాపారి రాజు షా, ఆయన కుమార్తె నిక్కి కుమారి(20 పై నక్సల్స్‌ కాల్పులు జరిపారు. దాదాపు 100 నుండి 150 మంది నక్సల్స్‌ పోలీసు దస్తుల్లో రాజుషా నివాసానికి చేరుకున్నారు. అందులో 15 నుంచి 20 మంది నక్సల్స్‌ రాజు ఇంట్లోకి చొరబడి.. బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులను దోచుకున్నారు. నక్సల్స్‌ను అడ్డుకున్న రాజు, ఆయన కుమార్తెపై వారు కాల్పులు జరిపి పరారీ అయ్యారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ రాజు, నిక్కి కుమారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనపై రాజు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/