తమకూరు నుండి ఓడిపోయిన దేవేగౌడ

Deve Gowda
Deve Gowda

బెంగాళూరు: మాజీ ప్రధాని దేవేగౌడ తమకూరు నుండి ఓడిపోయారు. ఈ స్థానంలో బిజెపి అభ్యర్థి బసవరాజ్‌ గెలుపొందారు. అయితే దేవగౌడ్‌ 1953లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన ఆయన అప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కర్ణాటక సీఎంగా, భారత ప్రధానిగా కూడా విధులు నిర్వర్తించారు. మొదట కర్ణాటకలోని హోళెనరసిపుర శాసనసభ నియోజకవర్గం నుంచి 1962లో తొలిసారిగా దేవెగౌడ ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం కూడా మరో ఐదు సార్లు అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991నుంచి ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లోనూ హసన్ నుంచి పోటీ చేసి గెలుపోందారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/