బంద్‌ అయిన జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారి

Jammu Srinagar National Highway
Jammu Srinagar National Highway

జమ్ము: జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారి బంద్‌ అయింది. భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘటన జరిగింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారంగా జమ్ముకశ్మీర్‌లోని రాంబన్‌లో ఈరోజు తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడుతున్నట్లు సమాచారం. శిథిలాల తొలగింపుకు సహాయక సిబ్బంది, మెషిన్లు రంగంలోకి దిగాయి. సాధ్యమైనంత తొందరగా రహదారి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు జాతీయ రహదారి రాంబన్‌ డీఎస్పీ సురేశ్‌ శర్మ తెలిపారు.కశ్మీర్‌ను మిగతా దేశంతో కలిపే ఈ రహదారి మూసుకుపోవడంతో భారీ ఎత్తున ట్రాఫిక్‌ జాం అయింది. వేల సంఖ్యలో వాహనాలు రహదారి వెంబడి నిలిచిపోయాయి.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/