భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఐఈడి అమర్చిన ఉగ్రవాదులు

బాంబును కనిపెట్టి నిర్వీర్యం చేసిన భద్రతా సిబ్బంది

jammu-poonch highway
jammu-poonch highway


రాజౌరి: జమ్ముకాశ్మీర్‌లో రాజౌరి జిల్లాలో బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు చేసిన యత్నాన్ని భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. భద్రతా సిబ్బందే లక్ష్యంగా రహదారి పక్కన అతి శక్తివంతమైన ఐఈడీలను అమర్చారు. వీటిని గుర్తించిన జవాన్లు బాంబు స్క్వాడ్‌ సాయంతో నిర్వీర్యం చేశారు. సోమవారం ఉదయం ఆర్మీ రోడ్‌ ఓపెనింగ్‌పార్టీ(ఆర్‌ఓపి) విభాగానికి చెందిన జవాన్లు జమ్మూ-పూంఛ్‌ హైవేపై పెట్రోలింగ్‌ చేస్తుండగా..రాజౌరి జిల్లా కల్లార్‌ చౌక్‌ సమీపంలో అనుమానాస్పద సమాచారమిచ్చారు. భద్రతా సిబ్బంది దాన్ని పరిశీలించగా..ఐఈడి అమర్చినట్లు తెలిసింది. దీంతో రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. బాంబును ముందుగానే గుర్తించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/