గృహ నిర్బంధంలో కశ్మీర్‌ మాజీ సిఎంలు

శ్రీనగర్‌లో 144 సెక్షన్‌

mehbooba, omar abdullah
mehbooba, omar abdullah

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. అక్కడేం జరుగుతోందన్న ఉత్కంఠ రోజురోజుకు ఎక్కువవుతోంది. కేంద్ర బలగాల మోహరింపు సహా జరుగుతున్న పరిణామాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో నేడు ఏదో జరగబోతోందన్న అనుమానాలు మరింత బలపడ్డాయి.

తమను అదుపులోకి తీసుకోవడంపై మాజీ సీఎంలు ట్వీట్ చేశారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఒమర్ అబ్దుల్లా పిలుపునివ్వగా, సోమవారం ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలని మెహబూబా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్‌, సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగామిలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నా పోలీసులు ధ్రువీకరించలేదు. కాగా, నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూతపడనున్నాయి.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/