మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

modi
modi

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని కిష్టావర్‌ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడి కూడా స్పందిస్తూ జమ్ముకశ్మీర్‌లోని జరిగిన బస్సు ప్రమాదం హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. మృతుల ఆత్మలకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ట్విటర్‌ వేదికగా మోడి విచారం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా ఘటనపై స్పందించారు. విషయం తెలియగానే తీవ్ర ఆవేదనకు గురయ్యాను. మృతుల కుటుంబాలను సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ట్వీట్ చేశారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/