చిదంబరాన్ని కలిసేందుకు అనుమతి లేదు!

chidambaram
chidambaram


న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌మీడియాకేసులో సిబిఐ కస్టడీలో కొనసాగుతున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని కలుసుకునేందుకువెళ్లిన కాంగ్రెస్‌ నాయకులను జైలు అధికారులు అడ్డుకున్నారు. ముకుల్‌ వాస్నిక్‌, పిసిచాకో, మాణిక్కమ్‌ టాగోర్‌ అవినాస్‌ పాండే తదితరులు తీహార్‌జైలుకువెళ్లి ఆయన్ను కలుసుకోవాలని నిర్ణయించారు. అయితే తీహార్‌జైలు అధికారులు వారికికేటాయించిన సమయం మించిపోయిందని ఇతర నాయకులెవ్వరినీ కలుసుకునేందుకు అనుమతించలేదు. ఈనెల 19వ తేదీవరకూ చిదంబరం సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సిబిఐ కస్టడీలోనే ఉంటారు. ఇందుకోసం జైలు అధికారులు ఆయన్ను తీహార్‌జైలుకు తరలించారు. నాయకులు జైలు సూపరింటెండెంట్‌తో మాట్లాడినా వారు అంగీకరించలేదు. చిదంబరాన్ని ఏడోనెంబరు సెల్‌లో ఉంచారు. తీహార్‌జైలులోని తొమ్మిదవ వార్డులో ఏడోనెంబరు గదిలో ఉంచారు. ఆసియాలోనే అతిపెద్ద జైలుగా ఉన్న తీహార్‌జైలులో చిదంబరాన్ని ఉంచాలని అధికారులునిర్ణయించారు.

ఆయనకు జడ్‌స్థాయిభద్రత ఉండటంతో సిబిఐ కోర్టు న్యాయమూర్తిచిదంబరం న్యాయవాది కపిల్‌ సిబాల్‌ దాఖలుచేసిన విజఒప్తిపై ఆయనకు ప్రత్యేక వసతులు కల్పించేందుకు అంగీకరించింది. ప్రత్యేకగది, మంచం, బాత్‌రూమ్‌ పాశ్చాత్యవసతులు, రక్షణ, వైద్యం మందులు అన్నీ అందుబాటులో ఉంచింది. ఇతర ఖైదీలవలే చిదంబరం జైలులోని లైబ్రరీని సందర్శించవచ్చు. నిర్దిష్ట వ్యవధివరకూ ఆయన టివిని వీక్షించే అవకాశం ఉంది. 74 ఏళ్ల చిదంబరం రౌస్‌ అవెన్యూ కోర్టునుంచి అత్యంత భద్రత మధ్య జైలుకు తరలించారు. 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలోనే విదేశ ఈనిధులు ఐఎన్‌ఎక్స్‌మీడియా సంస్థకు రప్పించాలంటే అందుకు మంజూరుచేసేందుకు ఆయన కుమారుడు కార్తిచిదంబరానికి ముడుపులుచెల్లించినట్లు ఇంద్రాణి ముఖ్రేజా ఇచ్చిన వాంగ్మూలాన్ని అనుసరించి ఆయన్ను సిబిఐ అరెస్టుచేసింది. ఐఎన్‌ఎక్స్‌మీడియా వ్యవస్థాపకులు పీటర్‌, ఇంద్రాణి ముఖ్రేజాలు ప్రస్తుతం ముంబయి జైలులో ఉన్నారు. వారి కుమార్తె షీనాబోరా హత్యకు సంబంధించి వీరిని విచారించినసంగతి తెలిసిందే. ఇదేకేసులో చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌కేసులు నమోదు చేసింది.
తాజా క్రీడల వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/