కాబోయే సిఎంకు ఘనస్వాగతం

Jagan
Jagan

న్యూఢిల్లీ: ఏపికి కాబోయే సిఎం జగన్‌కు ఢిల్లీలోని ఏపి భవన్‌లో ఘనస్వాగతం లభించింది. జగన్‌ కాన్వాయ్‌ ఏపీ భవన్‌కు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తరువాత జగన్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ భవన్‌లో స్థానికంగా తనను కలవడానికి వచ్చే వారితోనూ జగన్‌ మాట్లాడారు. ఏపీ క్యాడర్‌ అధికారులు ఆయన్ని కలిశారు. మధ్యాహ్న భోజనం ఏపీ భవన్‌లోనే చేసి జగన్‌ సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/