కేంద్రం సహాయ సహకారాలు అందించాలని కోరాను

Jagan
Jagan


న్యూఢిల్లీ: ఏపికి కాబోయే సిఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీలోని ఏపి భవన్‌లో మీడియా సమావేశ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం సహకారం అవసరమనే విషయాన్ని ప్రధాని మోడి దృష్టికి తీసుకెళ్లానని జగన్‌ తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులపై ఈ మూడు రోజుల్లో తెలుసుకున్న అంశాలపై ప్రధానితో చర్చించానన్నారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని మోడిని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన నాటికి రూ.97 వేల కోట్ల అప్పులుంటే.. ఈ ఐదేళ్ల చంద్రబాబు హయాంలో అది రూ.2.57 లక్షల కోట్లకు ఎగబాకిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానన్నారు. అప్పులపై వడ్డీయే దాదాపు రూ.20వేల కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పానన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి అన్ని రకాలుగా కేంద్రం సహాయ సహకారాలు అందించాలని కోరామని.. దీనికి ప్రధాని సానుకూలంగా స్పందించారని జగన్‌ వివరించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/