జగన్‌పై శివసేన ప్రశంసల జల్లు

ముంబై: ఏపి సియంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డిపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. తాజా ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీని భారీ మెజార్టీతో ఓడించి అఖండ విజయాన్ని చేజిక్కించుకున్న జగన్‌ను ‘విజయ వీరుడు’ అని అభివర్ణించింది. గురువారం వారి అధికారిక పత్రిక సామ్నాలో ప్రచురించిన సంపాదకీయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ రాష్ట్రంలో బిజెపి మాత్రం ఘోర పరాజయం మూటగట్టుకుందని వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/