అమిత్‌షాను కలిసిన వైఎస్‌ జగన్‌

amith-shah, jagan
amith-shah, jagan

న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌.. బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా నివాసనికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు జగన్‌ అమిత్‌ షాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 30న ముఖ్యమంత్రిగా విజయవాడలో తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అంతకుముందు జగన్‌ ప్రధాని మోడితో సమావేశమయ్యారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/