జవాన్ల మధ్య ఘర్షణ..ఆరుగురి మృతి

సహచర జవాన్లపై కాల్పులు జరిపిన రెహమాన్

Man fires
gun fires

రా§్‌ుపూర్‌:ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ పరిధిలోని ఇండోటిబెటన్ బోర్డర్ జవాన్ల బృందంలోని ఒకరు తోటి జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సహచర జవాన్లపై సర్వీసు తుపాకీతో కాల్పులు జరిపిన జవాను పేరు రెహమాన్ అని అధికారులు చెప్పారు. అనంతరం గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఈ ఘటనలో గాయాలపాలైన వారిని రక్షించేందుకు వైద్యులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. నారాయణ పూర్ లోని ఐటీబీపీ 45వ బటాలియన్ శిబిరంలో ఈ ఘటన చోటు చేసుందని అధికారులు వివరించారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/