తమిళనాడులో ఐటీ దాడులు

Income Tax Department
Income Tax Department

చెన్నై: తమిళనాడులో ఈరోజు ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుపుతుంది. ఎన్నికల సందర్భంగా భారీగా అక్రమ నగదు ఉందన్న సమాచారంతోనే సోదాలు చేపట్టినట్లు ఓ ఐటీ అధికారి వెల్లడించారు. పీఎస్‌కే ఇంజినీరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి చెందిన ఓ గుత్తేదారు వద్ద భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు. దీంతో ప్రాథమిక విచారణ చేపట్టి చెన్నైతో పాటు నమక్కల్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఎన్నికల కోసం చెన్నైలోని కొంత మంది ఫైనాన్షియర్లు భారీ ఎత్తున నగదు సమకూరుస్తున్నట్లు సమాచారం రావడంతో చెన్నైలోని ఐటీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. అందులో భాగంగా ఆకాశ్‌ భాస్కరన్‌, సుజయ్‌ రెడ్డికి చెందిన చెన్నై, తిరునల్వేలిలోని వారి నివాసాలతో పాటు మరో పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/