ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే చర్యల్ని తీసుకోలేదు

ఆర్థిక మంత్రి కోటలు దాటేలా ఉన్నా..బడ్జెట్‌ మాత్రం పేలవంగా ఉంది

Thomas Isaac
Thomas Isaac

్దన్యూఢిల్లీ: మందగమనంలో కొనసాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే చర్యల్ని కేంద్రం ఏ కోశానా తీసుకోలేదని కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఇసాక్‌ అన్నారు. ప్రభుత్వ వ్యయాల్ని పెంచకుండా.. వృద్ధిరేటు 10 శాంత ఆశిస్తామనడం అవివేకమే అవుతుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి మాటలు కోటలు దాటేలా ఉన్నా.. బడ్జెట్‌ మాత్రం పేవలంగా ఉందన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయింపుల్లో పెరుగుదల లేదని తెలిపారు. గ్రామీణ ఉపాధి కల్పన పథకానికి సవరించిన అంచనాల ప్రకారం రూ.10 వేల కోట్లు తక్కువగా కేటాయించారని చెప్పారు. ప్రభుత్వ వ్యయాల్ని కేవలం 9 శాతమే పెంచారని, ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ప్రపంచ వ్యాప్తంగా మాంద్య పరిస్థితులు ఒకవైపు, కరోనా వైరస్‌ మరోవైపు తరుముకొస్తున్నాయని హెచ్చరించారు. మరో వారం రోజుల్లో కరోనా వైరస్‌ను కట్టడి చేయకపోతే.. ప్రపంచ మార్కెట్లు దారుణంగా పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళపై కేంద్ర ప్రభుత్వం కత్తిగట్టిందని వ్యాఖ్యానించారు. ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా నష్టపోయిన తమపై కేంద్ర బడ్జెట్‌ 2020 కనికరించలేదని అన్నారు. గతంతో కేంద్ర పన్నుల్లో 3.5 శాతంగా ఉన్న కేరళ వాటాను.. పెంచాల్సింది పోయి 1.9 శాతం కోత విధించారని మండిపడ్డారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/