చంద్రయాన్-2 తీసిన తొలి చంద్రుడి ఫొటో

  • తొలి అద్భుతాన్ని ఆవిష్కరించిన చంద్రయాన్
Chandrayaan 2 sends first moon picture
Chandrayaan 2 sends first moon picture

న్యూఢిల్లీ : చంద్రయాన్2 ఉపగ్రహం తీసిన చంద్రుడి తొలి ఫొటోను పంపింది. ఆ తొలి ఫోటో ఇదేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఇస్రో ట్వీట్ చేసింది. ఆగస్టు 21న చంద్రుడి ఉపరితలానికి 2,600 కిలోమీటర్ల ఎత్తులో తీసిన ఫోటో అని పేర్కొంది. ఈ చిత్రంలో చంద్రుడి దక్షిణార్ధగోళంలో ఉన్న అపోలో క్రేటర్స్ బిలం, పశ్చిమ అంచులో ఉన్న మేర్ ఓరియంటేల్ అనే మరొక పెద్ద బిలాన్ని ఇస్రో గుర్తించింది. చంద్రయాన్2 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం దీర్ఘవృత్తాకారంగా తిరుగుతున్న దశలో ఉపగ్రహ కక్ష్యను బుధవారం మరింత తగ్గించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న తెల్లవారు జామున 1.40 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండ్ కానున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ 15 నిమిషాల్లో పూర్తి కానుందని అధికారులు వెల్లడించారు. నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో 20 నిమిషాల పాటు ఇంజిన్లను మండిం చి కక్ష్యను కుదించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/