అబ్దుల్ కలాం అవార్డు స్వీకరించిన ఇస్రో చైర్మన్‌

ISRO chief K Sivan-Palaniswami
ISRO chief K Sivan-Palaniswami

చెన్నై: ఇస్రో చైర్మన్‌ కె. శివన్‌ ప్రతిష్ఠాత్మక ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి చేతుల మీదుగా గురువారం స్వీకరించారు. అవార్డు కింద ప్రశంసా పత్రం, గోల్డ్ మెడల్‌తో పాటు రూ.5లక్షల నగదును బహూకరిస్తున్నారు. కాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందివ్వాల్సిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాలతో గురువారానికి వాయిదా వేశారు. అంతరిక్ష పరిశోధనల్లో భారత ప్రతిష్ఠను పెంచుతున్న శివన్‌ను తమిళనాడు సర్కారు ఈ అవార్డకు ఎంపిక చేసింది. చంద్రయాన్ 2తో పాటు సితార తదితర ప్రాజెక్టులు శివన్ పర్యవేక్షణలోనే రూపుదిద్దుకున్నాయి. అబ్దుల్ కలాం స్మారకార్థం 2015లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ఈ అవార్డును ప్రకటించారు. శాస్త్రసాంకేతిక, విద్యార్థి, సేవా రంగాల్లో కృషి చేసిన వారికి ఈ అవార్డులు అందిస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/