సెప్టెంబర్‌ 6న చంద్రుడిపై కి విక్రమ్‌ ల్యాండర్‌!

Chandrayaan-2
Chandrayaan-2

హైదరాబాద్‌: ఇటీవల ఇస్రో చైర్మన్‌ చంద్రయాన్‌-2 జూలైలో నింగికి ఎగిరే అవకాశాలున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే చంద్రుడి మీదకు ప్రయోగిస్తున్న చంద్రయాన్‌-2 భారత్‌కు చెందిన మొత్తం 14 పేలోడ్స్‌ను తీసుకెళ్లునున్నది. చంద్ర‌యాన్ స్పేస్‌క్రాఫ్ట్ సుమారు 3800 కేజీల బ‌రువు ఉంటుంది. చంద్రుడికి 100 కిలోమీట‌ర్ల దూరంలో చంద్ర‌యాన్ చ‌క్క‌ర్లు కొట్ట‌నున్న‌ది. సెప్టెంబ‌ర్ 6వ తేదీన ల్యాండ‌ర్ విక్ర‌మ్‌.. చంద్రుడిపై ల్యాండ్ అవుతుంద‌ని ఇస్రో వ‌ర్గాలు వెల్ల‌డించాయి. విక్ర‌మ్ ల్యాండ‌ర్‌తో పాటు ప్ర‌జ్ఞాన్ రోబ‌టిక్ రోవ‌ర్ కూడా చంద్రుడిపై దిగ‌నున్న‌ది. చంద్రుడిపై దక్షిణ ద్రువంలో విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను దించాల‌ని ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు. ద‌క్షిణ ద్రువంలో ఎక్కువగా ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గ‌ని ప్ర‌దేశంలో ల్యాండ్ చేయాల‌నుకుంటున్నారు. ఒక‌వేళ ల్యాండింగ్ ప్ర‌క్రియ‌ స‌క్సెస్ అయితే, అప్పుడు విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను సౌత్ పోల్‌లోనే దించుతారు. ఎంకే త్రీ హెవీ బూస్ట‌ర్ ద్వారా శ్రీహ‌రికోట నుంచి చంద్ర‌యాన్ మిష‌న్‌ను ప్ర‌యోగించ‌నున్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/