కల్పనా చావ్లా అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

kalpana chawla
kalpana chawla

చెన్నై: కల్పనా చావ్లా అవార్డు కోసం అనువైన అభ్యర్దులు దరఖాస్తులు చేసుకోవాలంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించే మహిళలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కల్పనా చావ్లా అవార్డుతో సత్కరిస్తుంది. ఈ అవార్డు కింద రూ. 5లక్షల నగదు, పతకం బహూకరిస్తుంది. ఈ ఏడాదికి గాను ఈ అవార్డు కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు ఈ నెల 30లోపు అర్హులైన అభ్యర్థులు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ప్రజాశాఖ, సచివాలయం దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/