నక్సల్‌ దాడిలో ఇన్‌ఫార్మర్లు మృతి

naxals
naxals

ముంబయి: నక్సల్స్‌ ఇద్దరు పోలీస్‌ ఇన్‌ఫార్మర్లపై దాడి చేసిన ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగింది. 20-25 మందికి పైగా ఒకేసారి దాడి చేసి ఈ ఇద్దరిని కాల్చి చంపినట్లు సమాచారం. ఈ ఘటనలో చనిపోయిన ఒక వ్యక్తిని మనోజ్‌ హిడ్కోగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ గురించి పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాడన్న అనుమానంతో పుర్సల్‌గొండి గ్రామానికి చెందిన ఇద్దరిని నక్సల్స్‌ కాల్చి చంపేసారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని, అలాగే మృతదేహాలను స్వాధీనపరుచుక్నుట్లు అధికారులు తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/