ఆర్థిక మాంద్యానికి చిదంబరం విధానాలే కారణం

suicide
suicide

రిటైర్డ్‌ అధికారి సూసైడ్‌ నోట్‌


న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరంపై మరో ఆరోపణ వచ్చిపడింది. ఇప్పటికే మనీల్యాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయనపై భారత ఎయిర్‌ఫోర్స్‌ మాజీ అధికారి ఒకరు ఆరోపణలు చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుత ఆర్ధిక మాంద్యానికి గత యుపిఎ ప్రభుత్వంలో చిదంబరంచేపట్టిన ఆర్థిక విధానాలే కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆయన విధానాలతో దేశంలోని ఆర్ధిక వ్యవస్థ గాడితప్పడంతో పాటు తన ఇంటిపై కూడ ప్రభావం పడిందన్నారు. అస్సాంలోని మంగల్‌డో§్‌ు ప్రాంతానికి చెందిన భారత వైమానిక దళ మాజీ అధికారి బిజాన్‌ దాస్‌ ఢిల్లీ ప్రయాగరాజ్‌లోని ఒక హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీకి ఆయన నాలుగు పేజీల సూసైడ్‌ నోట్‌ రాశాడు. నోట్‌లో యుపిఎ పాలనలో జరిగిన ఆర్థిక విధానాలే ప్రస్తుత ఆర్ధిక నష్టాలకు కారణమన పేర్కొన్నారు. చిదంబరం విధానాలతో తన కుటుంబంతో పాటు దేశంలో ఆర్ధిక మందగమనానికి గురైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమారుడి భవిష్యత్‌ను పిఎం నరేంద్రమోడీ చూసుకోవాలని కోరారు. అయితే ఇటీవల మనీల్యాండరింగ్‌ కేసులో అరెస్టు యిన చిదంబరం కేంద్ర ప్రభుత్వ విధానాలపై వ్యంగ్యాస్త్రాలను విసిరారు. కోర్టుకు హాజరైన చిదంబరంను బెయిల్‌ ఎందుకు రావండం లేదు అంటూ ప్రశ్నించిన జర్నలిస్టుకు తన అయిదు వేళ్లు చూపిస్తూ భారతదేశ జిడిపి వృద్ధి రేటు 5 కూడ దాటకపోవడంతో తనకు బెయిల్‌ రావడం లేదంటూ ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు సైతం ఆర్ధిక మాంద్యాన్ని ఎలా కట్టడి చేయాలో తెలియక మోడీ ప్రభుత్వం తికమకపడుతోందని విమర్శించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/