భారత సైన్యం సిద్ధంగా ఉంది

Bipin Rawat
Bipin Rawat

న్యూఢిల్లీ: అధీన రేఖ వెంబడి పాక్ తన ఉనికిని పెంచుకుంటూ పోతోందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సూటిగా స్పందించారు. దేశ సరిహద్దుల వెంబడి ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా వాటిని సమర్ధవంతంగా భారత సైన్యం తిప్పికొడుతుందని ఆయన అన్నారు. ఆర్మీ ఎప్పుడూ సర్వసన్నద్ధంగా ఉంటుందన్నారు. విరోధులు అధీనరేఖ వెంబడి తమ కార్యకాలాపాలను చురుకుగా సాగించాలనుకుంటే అది వారి ఇష్టమని అన్నారు. ముందస్తు మోహరింపులు అనేవి తప్పనిసరిగా ఉంటాయని, దీని గురించి తమకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పారు. ఆర్మీ, ఇతర సేవల విషయానికి వస్తే, మనం ఎప్పుడూ సర్వసన్నద్ధంగానే ఉంటామని రావత్ స్పష్టం చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/