ఇంకా ఆచూకీ తెలియలేదు

iaf-plane
iaf-plane

న్యూఢిల్లీ: సోమవారం మధ్యాహ్నాం భార‌త వైమానిక ద‌ళానికి చెందిన ఏఎన్‌-32 విమానం అస్సాంలో గల్లంతు అయిన విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు వైమానిక దళ విమానం ఆచూకీ తెలియలేదు. ఆ విమానంలో 13 మంది ప్ర‌యాణిస్తున్నారు. భార‌త ఆర్మీకి చెందిన పెట్రోలింగ్ బృందాలు విమానం కోసం గాలిస్తున్నాయి. సీ130జే విమానం ద్వారా అన్వేషిస్తున్నారు. అసోం నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్తుండగా వాయుసేన విమానం గ‌ల్లంతు అయ్యింది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఘటనపై సమీక్షిస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/