ఐటీ శాఖ, ఎన్నికల సంఘం సంయుక్త సోదాలు

Income Tax Department
Income Tax Department

చెన్నై: ఆదాయపన్ను శాక, ఎన్నికల సంఘం అధికారులు సంయుక్తంగా తమిళనాడులో డీఎంకే సీనియర్‌ నేత, పార్టీ కోశాధికారి దురై మురుగన్‌ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. వెల్లూరు కాట్‌పాడిలోని ఆయన నివాసానికిఈరోజు వేకువజామున అధికారులు చేరుకున్నారు. అలాగే ఆయనకు సంబంధించిన విద్యాసంస్థలు కింగ్‌స్టన్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్, దురై మురుగన్‌ బీఈడీ కళాశాలల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారం ముగించుకొని ఇంటికి చేరుకున్నాం. అప్పటికే ముగ్గురు అధికారుల బృందం ఇంట్లో ఉంది. ఎందుకు వచ్చారని ప్రశ్నించగా.. మేం ఐటీ అధికారులం, ఇంట్లో సోదాలు చేయాలని సమాధానం ఇచ్చారు. అలాగే సెర్చ్‌ వారెంట్స్‌లో అరక్కోణం పరిధిలో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు ఉంది. అక్కడ నగదు ఉంటే ఇక్కడ ఎందుకు సోదాలు జరుపుతున్నారని ప్రశ్నించాం అని డీఎంకే న్యాయవిభాగం కార్యదర్శి పరంధామం తెలిపారు. ఈ క్రమంలో అధికారులు, డీఎంకే సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సరైన ఆధారాలు లేనందున సోదాలు నిర్వహించడానికి అనుమతించమని డీఎంకే సభ్యులు, వారి న్యాయవాదులు తేల్చి చెప్పడంతో.. అధికారులు అక్కడి నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. అనంతరం ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ విజయ్‌ దీపన్‌ నేతృత్వంలో మరో బృందం మురుగన్‌ ఇంటికి చేరుకుని సోదాలు ప్రారంభించింది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/