స్మృతి ఇరానీ డిగ్రీ పై చర్చ

Smriti Irani certficate
Smriti Irani certficate

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై మరోసారి చర్చలకు వచ్చాయి. ఎందుకంటే ఎందుకంటే 2004 ఎన్నికలప్పుడు డిగ్రీ పట్టా పొందినట్టు, 2014లో బీకాం కోసం ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాని, ఇప్పుడేమో బీకాం పూర్తి చేయలేదని పేర్కొన్నారు స్మృతి ఇరానీ. తాజాగా నిన్న దాఖలు చేసిన ఎన్నికల ఆఫిడవిట్‌లో ఆమె తన విద్యార్హతలను పేర్కొన్నారు. 1991లో ఆల్ ఇండియన్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్(పదో తరగతి), 1993లో ఆల్ ఇండియన్ సీనియర్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్(ఇంటర్) ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఆమె డిగ్రీ విషయంలోనే మూడు సార్లు మూడు రకాలుగా చెప్పుకొచ్చారు. నిన్న దాఖలు చేసిన ఆఫిడవిట్‌లో 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో దూర విద్యలో బ్యాచిలర్ కామర్స్ పార్ట్ 1 మాత్రమే చదివానని, డిగ్రీ మొత్తం పూర్తి చేయలేదని పేర్కొన్నారు. అయితే 2004 ఎన్నికలప్పుడు స్మృతి ఇరానీ 1996లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందినట్టు పేర్కొన్నారు. 2014 ఎన్నికల ఆఫిడవిట్‌లో బీకామ్ కోసం 1994లో ఢిల్లీ యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్ తీసుకున్నట్లు తెలిపారు. అంతే కాదు.. 2014 ఆగస్టులో జరిగిన ఓ మీడియా సమావేశంలో స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. యూఎస్‌లోని ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందినట్లు చెప్పారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/