యడ్యూర్పతో పాటు ఇద్దరు ఉపముఖ్యమంత్రులు!

BJP leaders along with the party president B.S. Yediyurappa
BJP leaders along with the party president B.S. Yediyurappa

బెంగళూరు: కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడంతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బి.ఎస్‌.యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొనే అవకాశం అందివచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకుగానూ ఈరోజు బిజెపి శాసన సభాపక్ష సమావేశం జరిగింది. రాబోయే బిజెపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా యడ్యూరప్పతోపాటు.. మరో ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించే అంశాలపై చర్చించారు. ఈ ప్రతిపాదన ప్రతిని గవర్నర్‌ వజుభాయ్‌ వాలాకు యడ్యూరప్ప అందించారు. అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు యడ్యూరప్ప ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అధిష్ఠానం ఆదేశిస్తే ఈ రోజే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బిజెపి కు స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో సర్కారు ఏర్పాటుకు జాప్యం చేయకూడదని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/