అత్యాచారం కేసులో ఐఐటి ప్రొఫెసర్‌ అరెస్టు

rape attempt
rape attempt


న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో ఐఐటి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జోధ్‌పూర్‌-ఐఐటి ఎలక్ట్రానిక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఆయన విధులు నిర్వరిస్తున్నారు. గతంలో వివేక్‌ దగ్గర చదువుకున్న మహిళ ఫిర్యాదుపై పోలీసులు వివేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం కోసం వెళితే కొంత ఖర్చవుతుందని ప్రొఫెసర్‌ చెప్పినట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. జాబ్‌ ఇప్పిస్తానంటూ బాధితురాలిని ప్రొఫెసర్‌ తన రూమ్‌కు పిలిపించుకున్నారు. జాబ్‌ కావాలంటే కొంత ఖర్చవుతుందని చెపుతూ తనను బలవంతం చేశాడని బాధితురాలు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న నోయిడా పోలీసులు ప్రొఫెసర్‌ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ప్రొఫెసర్‌ను రిమాండ్‌కు తరలించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/