ఉగ్రవాదానికి పాకిస్థాన్ సహకరాన్ని ఆపేస్తేనే చర్చలు

  • జమ్మూకశ్మీర్ పై చర్చలు ఉండవు
Rajnath Singh
Rajnath Singh

న్యూఢిల్లీ: భారత్‌ పాకిస్థాన్‌ విషయంలో కఠిన వైఖరితో ముందుకు సాగుతోంది. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. పాకిస్థాన్ తో భారత్ చర్చలకు సిద్ధమని రాజ్ నాథ్ అన్నారు. అయితే, జమ్మూకశ్మీర్ అంశంపై ఈ చర్చలు ఉండవని… కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ పై మాత్రమే చర్చలు ఉంటాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో ఓ పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ సహకరాన్ని ఆపేస్తేనే ఈ చర్చలు కూడా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ తప్పు చేసిందని ఆరోపిస్తూ అంతర్జాతీయ సమాజం తలుపులను పాకిస్థాన్ కొడుతోందని ఆయన విమర్శించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/