ఐఏఎఫ్‌ విమానం మిస్సింగ్‌

iaf-plane
iaf-plane

న్యూఢిల్లీ: భారతీయ వైమానిక దళానికి చెందిన ఏఎన్‌-32 ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆచూకీ తెలియడం లేదు. అయితే ఐఏఎఫ్‌ విమానం అస్సాంలోని జోర్‌హోట్‌ నుండి బయలుదేరి 12.25 నిమిషాలకు టకాఫ్‌ తీసుకున్నది. అది అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మెచూకా ల్యాండింగ్‌ గ్రౌండ్‌కు వెళ్లాల్సి ఉంది. కాగా ఆ విమానం చివరిసారిగా ఒటి గంటకు కాంటాక్ట్‌ అయ్యింది. తరువాత ఆ విమానం మిస్సైనట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విమానంలో 13 మంది ప్ర‌యాణిస్తున్నారు.ఐఏఎఫ్ విమానం ఆచూకీ కోసం.. సుఖోయ్ 30 యుద్ధ విమానంతో గాలింపు చేప‌డుతున్నారు. సీ 130 స్పెష‌ల్ ఆప‌రేష‌న్ విమానాన్ని కూడా సెర్చ్ మిష‌న్ కోసం వాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఐఏఎఫ్‌ విమానం ఎక్కడికి వెళ్లిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/