మాయావతి సంచలన ప్రకటన

Mayawati
Mayawati

లఖ్‌నవూ: బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి సంచలన ప్రకటన చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి విజయమే తనకు ముఖ్యమని మాయావతి పేర్కొన్నారు. మాయావతి ఎన్నికల్లో పోటీ చేయరంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. వీటిపై ఆమె నేడు స్పష్టతనిచ్చారు. 
మాయావతి నేడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఎక్కడి నుంచి పోటీ చేసినా నేను గెలుస్తాననే విషయం తెలుసు. కానీ ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో నేను గెలవడం కన్నా మా కూటమి గెలవడమే నాకు ముఖ్యం. భాజపాను ఓడించేందుకు సమాజ్‌వాదీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్‌డీ) పార్టీలతో మా కూటమి బలంగా ఉంది. భాజపాపై మా ఉద్యమాన్ని కొనసాగించేందుకు నేను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశా. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా’ అని మాయావతి స్పష్టం చేశారు.