నామినేషన్‌ పై మరోసారి ప్రియాంక స్పష్టత

Priyanka Gandhi Vadra
Priyanka Gandhi Vadra

యూపీ: యూపి కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి ప్రియాంకా గాంధీ వాద్రా వారణాసి నుండి ఎందుకు పోటీ చేయడం లేదనే విషయపై ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వారణాసి స్థానం నుండి నామినేషన్‌ వేయకపోవడంపై ప్రియాంక మరోసారి స్పష్టత ఇచ్చారు. నేను పార్టీలో అందరు సీనియర్‌ నేతలు, సహచరుల సలహ తీసుకున్నా. ఇక్కడ 41 స్థానాలున్న సందర్భంగా వారంతా ఈ స్థానాల్లో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉందని భావించారు. కాగా ఒకవేళ నేను కేవలం ఒకే స్థానంపై మాత్రమే ఫోకస్ పెడితే పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులంతా నిరాశ చెందే అవకాశముందని ప్రియాంకాగాంధీ అన్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/