ఉరితీసే రోజు నా జీవితంలో అతి పెద్ద పండుగ

నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో దోషుల క్యూరేటివ్‌ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు

nirbhaya mother
nirbhaya mother

న్యూఢిల్లీ: ఈ నెల 22న నిర్భయ అత్యాచార దోషులను ఉరితీసే రోజు నా జీవితంలో అతి పెద్ద పండగ రోజు అవుతుందని నిర్భయ తల్లి ఆషాదేవి అన్నారు. నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో దోషులైన వినయ్ కుమార్‌ శర్మ, ముఖేష్‌ సింగ్‌ పెట్టుకున్న క్యూరేటివ్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఏకగ్రీవంగా తోసిపుచ్చడంపై నిర్భయ తల్లి ఆషాదేవి హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు అని ఆనందం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా దోషులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూ వచ్చానని తెలిపారు. కాగా దీనికి ముందు నిర్భయ అత్యాచారం కేసులో ఉరిశిక్ష పడిన వినయ్ కుమార్‌ శర్మ, ముఖేష్‌ సింగ్‌ల క్యూరేటివ్‌ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో దోషులకు న్యాయపరంగా అన్ని దారులూ మూసుకుపోయాయి.

తాజా ఎపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/