హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్‌షా

Amit Shah
Amit Shah

న్యూఢిల్లీ: అమిత్‌షా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నార్త్‌ బ్లాక్‌లోని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి చేరుకుని అమిత్‌షా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అమిత్‌ షాతో పాటు హోంశాఖ సహాయ మంత్రులుగా కిషన్‌రెడ్డి, నిత్యానందరాయ్‌ కూడా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు అమిత్‌ షా రాజ్‌నాథ్‌సింగ్‌ నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో రాజ్‌నాథ్‌సింగ్‌ హోంమంత్రిగా పనిచేసి విషయం తెలిసిందే.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/