హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా దత్తన్న

Bandaru Dattatreya
Bandaru Dattatreya

Hyderabad: తెలంగాణలో బీజేపీ సీనియర్ నేత అయిన బండారు దత్తాత్రేయకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవి ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా దత్తన్నను నియమించింది. 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా బీజేపీ తరపున పోటీ చేసి దత్తాత్రేయ విజయం సాధించారు. ప్రధాని మోదీ కేబినెట్‌లో కార్మికశాఖ మంత్రిగా దత్తాత్రేయకు బాధ్యతలు అప్పగించారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దత్తాత్రేయకు రాలేదు. అయితే దత్తాత్రేయ సీనియర్ నేత కావడం.. పార్టీలో చురుకుగా పనిచేస్తుండడంతో ఆయనకు పార్టీ అధిష్టానం గవర్నర్ పదవి ఇచ్చి గౌరవించినట్లు తెలుస్తోంది.