భారత్‌కు సాయం చేస్తాం… చైనా

గతంలో చైనాకు భారత్‌ సాయం

corona virus
corona virus

దిల్లీ: కరోనా.. ఇది మొదట చైనా లోనా వూహన్‌ లో మొదలయింది. ఆ తరువాత దేశ దేశాలు వ్యాపిస్తూ ఇపుడు ఇండియాలో విస్తరిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్‌ వల్ల ఇండియాలో 12 మంది చనిపోయారు. 600 పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీని వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం దేశం మొత్తం లాక్‌ డౌన్‌ ప్రకటించింది. దేశం చేస్తున్న ఈ ప్రయత్నాలకు ప్రపంచం మొత్తం ఇండియాను మెచ్చుకుంటున్నాయి. భారత్‌ లాంటి దేశంలో కరోనా విస్తరిస్తే జరిగే నష్టం ఊహలకందనిది. ఇంతటి విపత్కర పరిస్థితులలో భారత్‌ కు సాయం చేయడానికి చైనా ముందుకు వచ్చింది. వూహన్‌లో వైరస్‌ వ్యాప్తి జరిగినపుడు భారతదేశం తమకు సహయ సహకారాలు చేసిందని , ఇపుడు భారతదేశంలో కూడా వైరస్‌ వ్యాప్తి జరుగుతున్నందునా.. ఇండియాకు సాయం చేసేందుకు చైనా సిద్దంగా ఉందని, ఎటువంటి అవసరం వచ్చిన తమ వంతుగా చేతనయినంత సహాయం చేస్తామని, చైనా ఎంబసీ కౌన్సిలర్‌ జీ రాంగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/