నేడు 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు…వాతావరణ శాఖ హెచ్చరిక

rain
rain

న్యూఢిల్లీ : ఈరోజు దేశంలోని 13 రాష్ట్రాలో భారీ వర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హిమాలయాల సమీపంలోని సిక్కిం, పశ్చిమబెంగాల్, అసోం, మేఘాలయ, బీహార్ రాష్ట్రాల్లో శుక్రవారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. దీంతోపాటు గోవా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు కురవవచ్చిన కేంద్రం వెల్లడించింది. మణిపూర్, మిజోరం, త్రిపుర ప్రాంతాల్లో సాధారణ వర్షం కురవవచ్చని అధికారులు చెప్పారు. అంతేకాక అరేబియా సముద్ర తీరంలో గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ అల్లకల్లోలంగా ఉన్న ఈకారణంగా మత్స్యకారులు చేపలవేటకు సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/