ముంబయిలో వర్షాలతో పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

heavy rain in mummbai
heavy rain in mummbai


ముంబయి: భారీ వర్షాలతో ముంబయి నగరం వణికిపోతోంది. కాలనీల్లోకి చేరిన వరదనీటితో నదులను తలపిస్తోంది. జనం ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితితో పాఠశాలలు, కళాశాలలు సెలవు ప్రకటించాయి. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబయితోపాటు రాయిగఢ్‌ జిల్లాలో కూడా వర్షాల ప్రభావం ఉంది. దీంతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ముంబయి నగర శివారులో 50 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయింది. మూడు గంటలు కురిసిన కుంభవృష్టితో శివారు ప్రాంతాలు సముద్రంగా మారాయంటున్నారు. ముంబయిలోని పల్గార్‌, థానే, రాయిగఢ్‌ జిల్లాలో భారీ వర్సం కురిసింది. ఈ వర్షాలతో రైళ్లు, విమాన సేవలకు అంతరాయం కలిగింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/